Vastu tips:  ఒక బెడ్ రూం.. రెండు వాష్రూమ్స్ కట్టుకోవచ్చా.. బావిని పూడ్చి గది కడితే  ఇబ్బందులొస్తాయా..

Vastu tips:  ఒక బెడ్ రూం.. రెండు వాష్రూమ్స్ కట్టుకోవచ్చా.. బావిని పూడ్చి గది కడితే  ఇబ్బందులొస్తాయా..

ఇంటి నిర్మించేటప్పుడు కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటించాలి.  వాష్​ రూమ్స్​.. బెబ్​ రూమ్​ ఇలా ప్రతి దానికి వాస్తు ఉంటుంది.  అయితే ఒకే వాష్​ రూమ్​లో రెండు వాష్​ రూంలు నిర్మించుకోవచ్చా. ఏదిక్కులో నిర్మించు కోవాలి.. అలానే బావిని పూడ్చి గది కాని ఏ ఇతర నిర్మాణమైనా చేయవచ్చా..  మొదలగు విషయాల గురించి . .. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారి సలహాలను ఒకసారి తెలుసుకుందాం..!


ప్రశ్న: నైరుతి వైపు మాస్టర్ బెడ్రూబ్​ లో  రెండు బాత్రూమ్స్ కట్టుకోవచ్చా? ఏవైపు ఉంటే బాగుంటుంది?

జవాబు : మాస్టర్ బెడ్రూమ్లో రెండు వాష్రూమ్స్ కట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం ఇందులో దోషం లేదు. అయితే ఒకటి వాయువ్యంలో  .. రెండోది ఆగ్నేయంలో కట్టుకోవాలి.

 

►ALSO READ | రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినా... భారతీయులకు గుండెపోటు ఎందుకు వస్తుంది ? డాక్టర్ల హెచ్చరిక...


ప్రశ్న: పాత వ్యవసాయ బావిని పూడ్చి, అదే స్థలంలో పశువుల పాక కట్టుకోవాలి అనుకుంటున్నాం. అలా చేయొచ్చా? ఏమైనా జాగ్రత్తలు పాటించాలా?

జవాబు : వ్యవసాయ బావిని అవసరం లేదనుకుంటే పూడ్చుకోవచ్చు. కానీ, దాన్ని పూడ్చేసి, అదే స్థలంలో పశువుల పాక లేదా వేరే నిర్మాణం కానీ, చేయకపోవడమే మంచిది. బావి ఉన్నచోటుకు కొంచెం దూరంలో కట్టుకోవాలని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాధుని శ్రీనివాస్​ సూచిస్తున్నారు.